ఉంటేనే ఆనందం
10 July 2026
ఉండాలీ ప్రతివాడికి ఉంటేనే ఆనందం!
పొద్దునెపుడొ తిన్నావని రాత్రిదాక తినబోవని మరల మరల తినిపించే కనిపెంచిన కన్నతల్లి ఉండాలీ ప్రతివాడికి ఉంటేనే ఆనందం!
ప్రొద్దున ఆఫీసుకెళ్ళి సాయంత్రం బజారెళ్ళి తినటానికి ఏవేవో ప్రతిరోజూ కొనితెచ్చే మమతెరిగిన నాన్నగారు ఉండాలీ ప్రతివాడికి ఉంటేనే ఆనందం!
పగలంతా కంగార్లతొ రాత్రంతా కబుర్లతో రోజంతా సరదాగా ప్రతిరోజూ గడిపేసే అక్కయ్యలు బావగార్లు అన్నయ్యలు వదినగార్లు ఉండాలీ ప్రతివాడికి ఉంటేనే ఆనందం!
ఇంటిలోని వీధికేసి వీధిలోని వింటచేర్చి ఇల్లుపీకి పందిరేసి గోలచేసి గంతులేసి విసిగించే పిల్లసంచు ఉండాలీ ప్రతివాడికి ఉంటేనే ఆనందం!
వీధి తలుపు వేసుందని దొడ్డి తలుపు తీసుందని ప్రతి క్షణమూ అనుదినమూ సణిగే ఓ ముసలి బామ్మ పంచలోన మంచంలో ఉండాలీ ప్రతివాడికి ఉంటేనే ఆనందం!
ఉండాలీ ప్రతివాడికి ఉంటేనే ఆనందం!